ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువు నీటితో వరిసాగు.. మండువేసవిలో పచ్చదనం

ఆ రోడ్డుపై వెళ్తుంటే ఒక వైపు నిండుకుండలా సాగునీటి చెరువు.. మరోవైపు చూస్తే కనుచూపు మేరకు పచ్చదనంతో వరిసాగు. ఈ ప్రాంతం మరో కోనసీమను తలపిస్తోంది. నీటిని పొదుపుగా వినియోగిస్తూ.. మండు వేసవిలోనూ వరి సాగు చేస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

lake
చెరువు నీటితో వరిసాగు

By

Published : May 15, 2021, 6:40 PM IST

విశాఖ జిల్లా తురువోలు రోడ్డులో చీడికాడ ముఖద్వారం వద్ద పెద్ద చెరువు ఉంది. మండువేసవిలోనూ.. నిండు కుండను తలపిస్తోంది. ఈ చెరువు కోనాం జలాశయం ఆయకట్టు పరిధిలో ఉంది. జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటిని, వర్షాలు కురిసినప్పుడు వచ్చే నీటిని రైతులు సమష్టిగా చెరువులోకి మళ్లించుకుంటారు. ఆ నీటిని ఏడాది పొడవునా పొదుపుగా వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఎన్నో ప్రాంతాల్లో వేసవిలో నీటికోసం అల్లాడుతుంటే ఇక్కడ రైతులు మాత్రం ముందుచూపుతో చెరువులో నీటిని పొదుపు చేసుకున్నారు. వేసవిలో కూడా చెరువు దిగువ ఆయకట్టులో వరిసాగు చేశారు. కనుచూపు మేర పచ్చదనంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మారి.. మరో కోనసీమను తలపిస్తోంది. చెరువులో నీటిని పొదుపు చేసుకుని సాగుకు ఇబ్బందులు రాకుండా.. వరి పంట పండిస్తున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details