విశాఖ జిల్లా ఎలమంచిలిలో మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రాయితీపై ఉల్లి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉదయం నుంచి మహిళలు లైన్లలో వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఒకటే పంపిణీ కేంద్రం ఉన్నందున పంపిణీ ఆలస్యమవుతోందని మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు. చంటి బిడ్డలతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. కేవలం కిలో ఉల్లి మాత్రమే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబానికి 5 కిలోల ఉల్లిపాయలు ఇచ్చి... క్యూలో నిల్చునే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
తీరని ఉల్లి కష్టాలు - విశాఖ జిల్లా యలమంచిలి పట్నంలో తీరని ఉల్లి కష్టాలు వార్తలు
రాష్ట్రంలో ఉల్లి కష్టాలు ఇంకా తీరడం లేదు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి చూస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలిలో సబ్సిడీ ఉల్లి కోసం మహిళలు బారులు తీరారు. ఉదయం నుంచి లైన్లలో ఉంటున్నామని అయినా తమకు ఉల్లి అందడం లేదని వాపోతున్నారు.
తీరని ఉల్లి కష్టాలు