భవిష్యత్ తరాల కోసం నాణేల సేకరణ - konathala srinivasa rao
పాత కాలానికి చెందిన నాణేలు భవిష్యత్ తరాలకు చూపించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల శ్రీనివాసరావు. ఇందుకోసం 1950 నుంచి నాణేలు, కరెన్సీని సేకరిస్తున్నారు.
పాత కాలంలోని కరెన్సీ నేటితరానికి పరిచయం చేసేందుకు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల శ్రీనివాసరావు నాణేలు సేకరిస్తున్నారు. 1950 నుంచి భారత ప్రభుత్వం విడుదల చేసిన నాణేలు, నోట్లను సేకరిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనితో పాటుగా బ్రిటీష్ కాలంలోని నాణేలను సేకరించి వాటిని పొందుపరిచారు. తన తండ్రి నూకరాజు స్ఫూర్తితో నాణేలను సేకరించడం ప్రారంభించినట్లు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా పని చేసినప్పుడు వచ్చిన నోట్లనూ... సేకరించి పదిలంగా ఉంచారు. నాణేల గురించి తెలుసుకునే వాళ్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శ్రీనివాసరావు అంటున్నారు.