విశాఖలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
విశాఖ జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.
ntr
నర్సీపట్నంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ... రాజకీయాలకు సరికొత్త నిర్వచనం తీసుకువచ్చిన వ్యక్తి దివంగత నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం చెందినంత మాత్రాన కార్యకర్తలు నాయకులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గెలిపించేందుకు గ్రామ స్థాయి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Last Updated : May 28, 2019, 12:51 PM IST