విశాఖ జిల్లా మల్కాపురానికి చెందిన మాధురికి.. అనకాపల్లికి చెందిన మున్నాకి పెద్దలు వివాహం నిశ్చయించారు. వైభవంగా పెళ్లి చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నారు. కరోనా ప్రభావంతో బంధువులెవరూ లేకుండానే వివాహ తంతు పూర్తి చేశారు. నేడు వారి వివాహం వధూవరుల తల్లిదండ్రుల సమక్షంలోనే నిరాడంబరంగా పూర్తయింది. మాస్కులు ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ వేడుకను నిర్వహించారు.
కరోనా ఎఫెక్ట్: తల్లిదండ్రుల సమక్షంలోనే వివాహం - కరోనా ప్రభావంతో అనకాపల్లిలో నిరాడంబర వివాహం వార్తలు
కరోనా నేపథ్యంలో చాలా వివాహాలు వాయిదా పడ్డాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మరి కొన్ని వివాహాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇలాంటిదే విశాఖ జిల్లాలో ఓ వివాహం జరిగింది.
![కరోనా ఎఫెక్ట్: తల్లిదండ్రుల సమక్షంలోనే వివాహం no guests in marriage at anakapalli vizag due to corona effect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6856756-542-6856756-1587298423800.jpg)
నిరాడబరంగా పెళ్లి