విశాఖపట్నంలో నిర్వహిస్తున్న నేషనల్ సిటీ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు&భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి టీ.కృష్ణబాబు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. నగర ప్రజలకు నీటి అవసరాలను తీర్చడంపై ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ వంటి అధిక జనాభా కలిగిన నగరాల ప్రణాళికలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నగరాలలో మధ్యతరగతి ప్రజల అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ఆదర్శ కాలనీల అంశంపై కూడా చర్చించారు. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి వచ్చిన నిపుణులు... తక్కువ ధరతో గృహ నిర్మాణాలు ఎలా చేయవచ్చో వివరించారు.
పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు
విశాఖలో జరుగుతున్న కంట్రీ ప్లానర్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించే మోడల్ కాలనీలు, నీటి అవసరాలపై కూడా చర్చ జరిపారు.
పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు