విశాఖ మన్యంలో కాఫీ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్న నాంది ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మకమైన 'పుడ్ విజన్ 2050' పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన రాక్‌ఫిల్లర్ ఫౌండేషన్.. నాంది సంస్థను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
2050 నాటికి ఆహారోత్పత్తిలో రానున్న మార్పులు, లాభదాయక సాగు విధానాలపై రూపొందించిన ప్రణాళికకు గాను ఈ పురస్కారం అందుకుంది. ఇందుకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ 2 లక్షల డాలర్లు ఇవ్వనుందని నాంది సంస్థ తెలిపింది.