ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిబ్బందికి రక్షణ పరికరాలు సరఫరా చేయండి

కొవిడ్​ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం రక్షణ పరికరాలు సరఫరా చేయాలని సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్​ కోరారు. విశాఖలో పాజిటివ్​ కేసులు పెరుగుతున్న కారణంగా నిరుపేదలకు నెలకు రూ.10 వేల నగదుతో పాటు నిత్యావసర వస్తువులు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విశాఖలో మున్సిపల్ కార్మికుల నిరసన
విశాఖలో మున్సిపల్ కార్మికుల నిరసన

By

Published : Jun 25, 2020, 4:52 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలు అందించాలని సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు. సీపీఎం విశాఖ నగర పార్టీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే నగరంలోని మురికివాడల్లో కరోనా వ్యాప్తి చెందిందని... వైరస్​ని అరికట్టేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కంటైన్మెంట్​, రెడ్​జోన్లలో పనిచేస్తున్న మున్సిపల్, ఆశా వర్కర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, పోలీసు, సచివాలయం వాలంటీర్లు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలో పాజిటివ్​ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలో సామాన్యులకు 6 నెలల పాటు రూ.10 వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించాలని కోరారు.

ఇదీ చూడండి:జీతం లేక.. కూలి పనులు చేస్తున్న అధ్యాపకుడు

ABOUT THE AUTHOR

...view details