ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గెలిస్తే భూకబ్జాలపై ప్రత్యేక దృష్టి' - VV

విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ఉషాకిరణ్ సీతమ్మధారలోని తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. జనసేన గెలిస్తే నగరంలోని భూకబ్జాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

వి.వి లక్ష్మినారాయణ

By

Published : Mar 25, 2019, 5:51 PM IST

మౌలికసదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తాం: వి.వి లక్ష్మినారాయణ
విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన అసెంబ్లీఅభ్యర్థిని పి. ఉషాకిరణ్ సీతమ్మధారలోని తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.అభ్యర్థితో పాటు లోక్​సభ అభ్యర్థి వి.వి. లక్ష్మీనారాయణకూడా హాజరయ్యారు. తాము గెలిస్తేనగరంలో జరిగిన భూకబ్జాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామనితెలిపారు. కాలుష్యం, తాగునీరు, గంగవరం భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని లక్ష్మీనారాయణ అన్నారు.ముఖ్యంగా మహిళా అభ్యున్నతి కోసం జనసేన అనేక పథకాలను రచించిందన్నారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని ఉషా కిరణ్ స్పష్టం చేశారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన గంప గోవిందు, బిఎస్పిరెబెల్ అభ్యర్ధిగా పాల్తేటి పెంటారావు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు నామ పత్రాలను సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details