విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులో మోదకొండమ్మ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారి ఘటాలు ధరించిన భక్తులు ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చిమోదకొండమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా పరిసర గ్రామాల్లో సందడి నెలకొంది. డప్పు దరువులు, కొలాటాలు, ఘాటాలతో నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.
ఘనంగా కొత్తూరు మోదకొండమ్మ జాతర - మోద కొండమ్మ జాతర
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరొందిన కొత్తూరు మోదకొండమ్మ జాతర ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి ముగిసిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు ఘటాలు మోస్తూ అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజాలు చేశారు.
ఘనంగా కొత్తూరు మోదకొండమ్మ జాతర