ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లీకూతుళ్లకు పింఛను కష్టం..స్పందించి సాయం చేసిన ఎమ్మెల్యే - MLA Velagapudi gave pension to mother daughters

పింఛను నిలిచిపోయిన వృద్ధురాళ్లయిన తల్లీ కుమార్తెలకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సాయం అందించారు. వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

1
1

By

Published : Sep 7, 2021, 12:36 PM IST

Updated : Sep 7, 2021, 8:17 PM IST

ఓకే రేషన్ కార్డులో ఉన్న తల్లీకూతుళ్లకు పింఛను నిలిపివేతపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. విశాఖపట్నం సింహాద్రిపురం కాలనీకి చెందిన కంటిబుక్త అప్పల నరసమ్మ (110), కంటిబుక్త లక్ష్మి (80) ఇరువురూ ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. అప్పల నరసమ్మ 100 రూపాయల నుంచి పింఛన్ తీసుకుంటూ వస్తోంది. కొన్నినెలలుగా వేలిముద్ర పడటం లేదని పింఛన్ ఆపేశారు. ఆమె కుమార్తె లక్ష్మికి కూడా గత నెల నుంచి పింఛను నిలిపివేశారు. ఈ సమస్యపై ఈటీవీ భారత్​-ఈనాడులలో కథనాలు రావడంతో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి స్పందించి.. వారిని పరామర్శించారు.

పింఛన్ నిలిచిపోయిన తల్లీకూతుళ్లకు ఎమ్మెల్యే వెలగపూడి సాయం అందించారు. సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పింఛన్​ డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు. అంతేగాకుండా ఈ నెల మొత్తాన్ని వారికి అందజేశారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. పింఛను వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి తన వ్యక్తిగత అవసరాల కోసం.. చాలామంది పింఛన్లు నిలిపివేశారని ఎమ్మెల్యే విమర్శించారు.


ఇదీ చదవండీ..LIVE VIDEO: చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోతున్న అతనిని..

Last Updated : Sep 7, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details