ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపాను విమర్శించే అధికారం అయ్యన్నకు లేదు' - అయ్యన్నపాత్రునిపై మండిపడ్డ ఎమ్మెల్యే ఉమాశంకర్ వార్తలు

తెదేపా హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రునిపై.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా.. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వంపై విమర్శలు చేసే అధికారం తెదేపా నేత అయ్యన్నపాత్రునికి లేదని విమర్శించారు.

mla uma shankar ganesh fires on former minister ayyannapatrudu
'అయ్యన్నపాత్రునికి వైకాపాను విమర్శించే అధికారం లేదు'

By

Published : Dec 15, 2020, 12:33 PM IST

Updated : Dec 15, 2020, 12:47 PM IST

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వంపై విమర్శలు చేసే అధికారం తెదేపా నేత అయ్యన్నపాత్రునికి లేదని దుయ్యబట్టారు.

తెదేపా హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు.. పురపాలక పరిధిలో ఇంటి పన్ను తగ్గించడంలో విఫలమయ్యారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే.. పన్నులు 25 శాతం తగ్గించామన్నారు. గృహ నిర్మాణ పథకానికి సంబంధించి తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్ల పాటు వైకాపానే అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Last Updated : Dec 15, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details