విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని.. మున్సిపాలిటీ సిబ్బందికి మెప్మా ఆధ్వర్యంలో కోవిడ్ నివారణ కిట్లను పంపిణీ చేశారు. పెద్ద బొడ్డేపల్లిలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతులమీదుగా అందజేశారు.
మాస్కులతో పాటు డెటాల్ సబ్బులు, ఇతర రక్షణ కవచాలను ఉంచి కిట్లు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సరోజిని, లలితతో పాటు అధికారులు పాల్గొన్నారు.