నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలావరకు పనులు చేశానని అందుకే ప్రజలు నన్ను గుర్తించి గెలిపించారన్నారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనులు జరిగే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం నాయకులు గణబాబుకు ఘనంగా సన్మానం చేశారు. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
'ప్రజలకు అందుబాటులో ఉంటా.. అభివృద్ధి చేస్తా' - constituency
ఎన్నికల్లో తనను గెలిపించినందుకు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఎమ్మెల్యే