రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా మేలు చేసేందుకు సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఖరీఫ్ సీజన్ నాటికి రాష్ట్రంలో 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు. విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన.. పద్మనాభం మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో విత్తన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అన్ని రకాల సబ్సిడీ విత్తనాలు, పంట రుణాలు, సీజనల్ పంటలపై రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తగిన సిబ్బందిని నియమిస్తామన్నారు.
'ఖరీఫ్ నాటికి రైతు భరోసా కేంద్రాలు'
ఖరీఫ్ సీజన్ నాటికి రాష్ట్రంలో 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో విత్తన శుద్ధి కేంద్రాల్ని ఏర్పాటుచేస్తామన్నారు.
kannababu