ప్రతి పౌరునికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో కొవిడ్-19 పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ముందుగా చికిత్స అందించాలని.., కరోనా మరణాల రేటును తగ్గించేందుకు కృషిచేయాలని మంత్రి సూచించారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పెంచాలన్నారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించేందుకు ఏ విధమైన సమస్యలు లేకుండా...అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.