పబ్లిక్-ప్రవేట్ భాగస్వామ్యంలో విశాఖ జిల్లాలోని భీమునిపట్నం బీచ్ అభివృద్ధికి 'సన్ రే రీసార్ట్స్' ముందుకు రావడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు రూ. 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 'సన్ రే పార్కు'ను ఆయన శంకుస్థాపన చేశారు.
పార్కు నిర్మాణానికి మంత్రి అవంతి శంకుస్థాపన
భీమునిపట్నం బీచ్ అభివృద్ధికి 'సన్ రే రీసార్ట్స్' ముందుకు రావడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 'సన్ రే పార్కు'కు ఆయన శంకుస్థాపన చేశారు.
భీమునిపట్నం బీచ్‌లో పర్యాటకులు చెట్ల కింద కూర్చొని తీరప్రాంత అందాలను వీక్షించేందకు తగిన చేస్తామని మంత్రి అవంతి అన్నారు. వీలైనంత త్వరగా వీధి లైట్లను ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. బీచ్ పరిసరాల్లో 600 కొబ్బరి చెట్లు నాటడమే కాకుండా 10 పదేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలు చేపడతామని సన్ రే రీసార్ట్స్ ఎండీ రాజబాబు తెలిపారు. భీమునిపట్నం బీచ్ రహదారి, ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజ్ నుంచి భోగాపురం వరకు మొక్కల సంరక్షణ సన్ రే రీసార్ట్స్ యాజమాన్యం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ గోవిందరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పార్గొన్నారు.
ఇదీ చదవండి:క్రిప్టో కరెన్సీపై త్వరలో కేంద్రం బిల్లు