ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను ఖతం చేద్దాం.. లాక్ డౌన్ పాటిద్దాం

విశాఖ మన్యంలో లాక్ డౌన్ ను ప్రజల సహకారంతో పోలీసులు సమర్థంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి అక్కడికక్కడే శిక్ష విధిస్తూ ఇళ్లకు తిప్పి పంపుతున్నారు. గుంజీలు తీయిస్తూ జనాలు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

By

Published : Mar 25, 2020, 3:47 PM IST

lock-down-is-tightly-enforced-at-paderu-in-vishakha-manyam
lock-down-is-tightly-enforced-at-paderu-in-vishakha-manyam

అక్కడ లాక్​డౌన్​ని అతిక్రమిస్తే గుంజీలే!

విశాఖ మన్యం పాడేరులో లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. రహదారులు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువకుల్ని పోలీసులు అడ్డుకుని.. గుంజీలు తీయిస్తున్నారు. మళ్లీ వస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. పాడేరులోని కుమ్మరిపుట్టు యూత్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కరోనా క్వారెంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జనావాసాల మధ్య ఇలాంటి ఏర్పాట్లు వద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. తమ గ్రామాల్లోకి ఎవరూ రావొద్దంటూ కొయ్యూరు మండలంలోని పలు గ్రామాలు చెట్లను నరికి వేశారు. తమ ఊరిలోకి ఎవరూ రావొద్దంటూ నల్లగొండ గ్రామంలో గోడపత్రిక ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details