ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో ఇళ్ల స్థలాలకు లేఅవుట్స్

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకూ ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలు పాటించడంలేదు. విశాఖ జిల్లా చోడవరంలో ఇళ్ల స్థలాలకు లేఅవుట్ వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

land-distribution-works
land-distribution-works

By

Published : Mar 17, 2020, 12:22 PM IST

చోడవరంలో ఇళ్ల స్థలాలకు లేఅవుట్స్

ఎన్నికల కోడ్​ను అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నంతవరకూ నిలిపివేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాలను బేఖాతరు చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో ఇళ్ల స్థలాలకు లేఅవుట్ వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. సర్వే రాళ్లు పాతడం, స్థలాలను చదున చేసే పనులను వేగవంతం చేశారు. లారీలు, ట్రాక్టర్ రావడంతో పంప్ హౌస్‌ వద్ద తాగునీటిని సరఫరా చేసే గొట్టాలు దెబ్బతిన్నాయి. తాగునీరు పంట కాలువలోకి పోతోంది. పంప్ హౌస్ వద్ద ఇళ్లస్థలాలు ఇవ్వొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు... నిరసన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details