విశాఖ జిల్లాలో...
కరోనా బాధిత జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పాత్రికేయ సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా సోకిన జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించాలనీ.. ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న వారి కోసం ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల నుంచి తొలగించిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్రిడేషన్లు అందించాలనీ.. హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య బీమాను అమలు చేయాలని అన్నారు.