Jana Sena: విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి ఘటనలో జనసేన నేతలు పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయగా వారిలో 61 మందిని ముందుగానే పదివేల పూచికత్తు పై విడుదల చేసారు. మిగిలిన 9మందికి హైకోర్టు బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల అనంతరం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 15 రాత్రి తమకు కాళారాత్రిగా మిగిలిందని, బలవంతంగా వాలంటీర్లను, విద్యార్థులను విశాఖ గర్జనకు తరలించారు.. అయినా విజయవంతం కాలేదని కానీ అశేష సంఖ్యలో జనం పవన్ కల్యాణ్ వచ్చినపుడు స్వాగతం పలికిన విధానం చూసి ఓర్వలేకే తమపై కేసులు పెట్టారని అన్నారు. తమపై మోపిన అక్రమ కేసులపై న్యాయపరంగా పోరాడరామన్నారు.
విశాఖ జైలు నుంచి విడుదలైన జనసేన నేతలు.. - రామకృష్ణ పురం
Jana Sena: విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి ఘటనలో అరెస్టయిన జనసేన నేతలకు నిన్న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ ప్రక్రియ పూర్తి చేసుకున్న జనసేన నాయకులు విశాఖ కేంద్ర కారాగారం నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వారికి జనసేన ముఖ్య నేతలు, జనసేన లీగల్ విభాగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
చట్టబబద్దంగానే తాము పోరాటం కొనసాగిస్తామని పీఏసీ సభ్యులు కొన తాతరావు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలపక్షాన నిలబడతామని, ఒత్తిళ్లకు బెదిరింపులకు తలొగ్గమని అన్నారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి అణచివేతకు పాల్పడ్డారని అరోపించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. జనసేన నాయకుల విడుదల సమయంలో విశాఖ జైలు పరిసరాలలో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత జైలు వద్ద ఏర్పాటు చేశారు. అర కిలోమీటర్ వరకు పోలీసులు తమ పరిధిలోకి తీసుకున్నారు. మరో వైపు జైలు నుంచి విడుదలైన జనసేన నేతలకు సంఘీభావంగా వచ్చిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ను రామకృష్ణ పురం దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
ఇవీ చదవండి: