తుపాన్ ప్రభావానికి గురైన మత్స్యకార గ్రామాలను వైకాపా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవటం దారుణమని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. విశాఖ జిల్లా రేవుపోలవరం మత్య్సకార గ్రామంలో పర్యటించిన ఆమె...బాధితులతో మాట్లాడారు. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయటంలో ప్రభుత్వం విఫలమైందని అనిత విమర్శించారు. తుపాను సంభవించి నాలుగు రోజులు గడుస్తున్నా..ముఖ్యమంత్రిగాని, మంత్రులు గాని ఏరియల్ సర్వే చేయకపోవటం సిగ్గుచేటన్నారు. సీఎంకు కేసుల మాఫీ చేసుకోవటానికి ఉన్నంత సమయం ప్రజాసంక్షేమంపై లేదని ఎద్దేవా చేశారు.
'జగన్కు కేసుల మాఫీపై ఉన్న శ్రద్ధ..ప్రజా సంక్షేమంపై లేదు'
విశాఖ జిల్లా రేవుపోలవరం మత్య్సకార గ్రామంలో తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పర్యటించారు. తుపాను ప్రభావానికి గురైన మత్స్యకార గ్రామాల్లో అధికారులు గానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గానీ ఇప్పటి వరకు పర్యటించకపోవటం దారుణమన్నారు.
జగన్కు కేసుల మాఫీపై ఉన్న శ్రద్ధ..ప్రజా సంక్షేమంపై లేదు