విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కోనాం మధ్య తరహా జలాశయం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 14 వేల 450 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 101.25మీటర్లు కాగా… ప్రస్తుతం 94.30 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. జలాశయం దిగువ కాలువలకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల అవుతున్న సాగునీరు సిరిజాం కాలువ, మంగళాపురం ఆనకట్టు పరిధిలో శివారు ప్రాంతాల్లో ఆయకట్టుకు పుష్కలంగా పారుతోంది. మండువేసవిలో శివారు ప్రాంత రైతుల నీటి అవసరాలు తీరుతున్నాయి. పశువులకు తాగునీరు లభిస్తోంది. కోనాం జలాశయం ఆయకట్టు పరిధిలోని శివారు ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.