ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన సదస్సు - OLDER PERSONS

ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన సదస్సును అనకాపల్లిలో వివరించారు. వృద్ధుల సంక్షేమ చట్టం, సీఆర్సీ 125 గురించి సదస్సులో పాల్గొన్న వారికి సీనియర్ న్యాయవాది శివయ్య వివరించారు.

' విశాఖలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన సదస్సు'

By

Published : Jun 15, 2019, 9:23 PM IST

' విశాఖలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన సదస్సు'

విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రపంచ వృద్ధుల వేదింపుల నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యం అతిథిగా సీనియర్ న్యాయవాది శివయ్య పాల్గొన్నారు. ఎన్నో ఆశలతో తల్లి దండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే.. వారిని పట్టించుకోని సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో వృద్ధులపై జరుగుతున్న వేధింపులకు అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వృద్ధులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై సీఆర్ సీ 125 ప్రకారం చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి వృద్ధులకు వివరించారు. 2007లో ప్రవేశపెట్టిన వృద్ధులు సంక్షేమ చట్టాన్ని సదస్సులో పాల్గొన్న వారికి న్యాయవాది తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details