ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2020, 6:14 PM IST

ETV Bharat / state

యాప్స్ కంటే 'మన దేశం-మన ఐక్యతే' ముఖ్యం

యాప్స్.. మొబైల్ ఫోన్లలో ఇవి అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. నేటి ఆధునిక సమాజంలో ప్రతి పనికీ ఓ యాప్ ఉందంటే అవి ఎంతలా ఫోన్లను ప్రభావితం చేశాయో చెప్పొచ్చు. నేటి యువత జీవితం నిద్రలేచిన దగ్గర్నుంచి, పడుకునే వరకు ఈ యాప్స్​తో ముడిపడి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి యాప్స్ తయారుచేయడంలో చైనా దిట్ట. అందుకే ఆ దేశ యాప్​లు మన యువతను ఆకర్షిస్తున్నాయి. వాటికి మిలియన్ల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. టిక్ టాక్ వంటి యాప్​లు భారత యువత జీవితంతో పెనవేసుకుపోయాయి. అయితే అదంతా గతం.. ఇప్పుడు డ్రాగన్ దేశం సరిహద్దుల్లో వ్యవహరిస్తున్న తీరు మన దేశ యువత మనసును గాయపరిచింది. స్వదేశీ ఉద్యమానికి తమవంతు సహకారమిస్తున్న యువత.. భద్రతా కారణాలతో 59 చైనా యాప్​లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తోంది.

apps
apps

యాప్స్ కంటే 'మన దేశం-మన ఐక్యతే' ముఖ్యం

టిక్ టాక్, బ్యూటీ ప్లస్, కామ్ స్కానర్, షేర్ ఇట్, ఇలాంటి ఎన్నో యాప్స్ లేకుండా మొన్నటివరకు మొబైల్ ఫోన్ నడిచేది కాదు. ఈ యాప్స్​తో మనకు అవసరమైన ఎన్నో పనులు చేసుకోవడమే కాక.. వినోదానికి ఢోకా ఉండేది కాదు. టిక్ టాక్​నే తీసుకుంటే.. ఈ యాప్​కు ఒక్క భారత్​లోనే మిలియన్ల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. దీనితో ఫేమస్ అయినవాళ్లు, తమ టాలెంట్​ను నిరూపించుకుంటూ అవకాశాలు పొందినవారు అనేక మంది ఉన్నారు. ఈ యాప్స్ వల్ల మన దేశం నుంచి చైనాకు ఎన్నో కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. ఇవన్నీ భారత యువత జీవితాల్లో మమేకమయ్యాయనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. మన దేశ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం అవలంభిస్తున్న చర్యలతో యువత ఆలోచనలో పడింది. అప్పటికే ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి మద్దతు తెలిపిన యువత.. 59 చైనా యాప్స్​ను నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ యాప్స్​తో ఎంతగా ముడిపడిపోయినా దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మన దేశం-మన ఐక్యత ముందు యాప్​లనేవి చిన్న విషయం అంటూ తేల్చేస్తున్నారు. ఇకపై మన ఇండియన్ యాప్స్ లోనే తమ ప్రతిభ చూపిస్తామని అంటున్నారు టిక్ టాక్ సెలబ్రిటీస్...

ఇంతకాలం చైనా యాప్​లను వినియోగించిన తామంతా.. ఇక నుంచి స్వదేశీ యాప్​లను ఆదరిస్తామని ముక్తకంఠంతో చెప్తున్నారు. యాప్​లు, తమ సౌకర్యం కంటే.. దేశ భద్రత, సమాచార గోప్యత వంటి అంశాలు ఎంతో ప్రాధాన్యమైనవని.. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని విశాఖ యువత తెలిపారు. మన అవసరాలకు అనుగుణంగా సొంతంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకునే నైపుణ్యం మనకుందని స్పష్టంచేశారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయని అంటున్నారు. విప్లవాత్మక ఆలోచనల దిశగా యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ఆకాశంలో కనువిందు చేయనున్న తోకచుక్క

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details