ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ గ్రామాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!

వర్షాకాలం వచ్చిందంటే చాలు...ఆ ప్రాంతాలకు రాకపోకలు ఉండవు. ఒకవేళ వెళ్లాలంటే సాహసం చేయక తప్పదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులో ఈదుకుంటూ...ఆ గ్రామాలకు వెళ్లాల్సి ఉంటోంది. ఇది విశాఖ మన్యంలోని డుంబ్రిగుడ మండలంలోని గిరిజన గ్రామాల పరిస్థితి.

tribal villages problems
విశాఖ మన్యం

By

Published : Aug 18, 2020, 10:50 AM IST

విశాఖ మన్యంలోని గిరిజన గ్రామాలకు వర్షాకాలంలో వెళ్ళాలంటే... ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులో ఈదుకుంటూ సాహసం చేయాల్సిందే. అరకులోయ నియోజకవర్గం పరిధిలోని డుంబ్రిగుడ మండలంలోని చంపపట్టి, పోతంగి తదితర గ్రామాలకు వెళ్లే మార్గంలోని వంతెన ఏడేళ్ల క్రితం కూలిపోయింది. నాటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాగులో ఈదుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ‌‌‌స్పందించి... తమ ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details