భారతీయ సంస్కృతి విధ్వంసం కారణంగా మానవ హక్కుల సమస్యపై చర్చించడం, గ్రంధాలు వెలువరించాల్సిన అవసరం కలిగిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వి. జి.డి. ప్రసాదరెడ్డి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా రైటర్ అకాడమీ ఆధ్వర్యంలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ అధిపతి ఆచార్య బాబివర్ధన్ ఈ పుస్తకం రాశారు. కార్యక్రమానికి హాజరైన ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యుడు మూర్తి మాట్లాడుతూ... భారతదేశంలో ప్రస్తుత సందర్భంలో అనేక విధాలుగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వి. వి. రమణ మూర్తి, వి. మౌనిక తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకావిష్కరణ - ఆంధ్రా యునివర్సిటిలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తక ఆవిష్కరణ
విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా రైటర్ అకాడమీ ఆధ్వర్యంలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ అధిపతి ఆచార్య బాబివర్ధన్ ఈ పుస్తకం రాశారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వి. జి.డి. ప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రా యునివర్సిటిలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తక ఆవిష్కరణ