విశాఖలో ఈనెల 17న జరగనున్న నేవీ మారథాన్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల నుంచి మారథాన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఆరో ఏడాది నిర్వహిస్తున్నఈ మారథాన్లో ఇప్పటికే 15 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. దాదాపు 18 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భారత నౌకాదళం నిర్వహిస్తున్న ఈ మారథాన్లో నాలుగు కేటగిరిల్లో బహుమతులు ఉండనున్నాయి.
ఇదీ చదవండి: తల్లీ బిడ్డను దూరం చేసిన డెంగీ