విశాఖ జిల్లా మాడుగులలో సోమవారం జరిగిన వారపు సంతకు సంక్రాంతి కళ వచ్చింది. పండగ ముందు వారం సంత కావడంతో పెద్ద ఎత్తున జనం వచ్చారు. ప్రతి వారం ఇక్కడ పెద్ద ఎత్తున సంత జరుగుతుంది. ఇక్కడకు మాడుగుల, చీడికాడ, పాడేరు తదితర మండలాలకు చెందిన గిరిజన, మైదాన ప్రాంత గ్రామాల ప్రజలు వచ్చి.. వారికి అవసరమైన సరుకులు, గృహోపకరణాలు, కూరగాయలు, దుస్తులు ఇలా అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు.
మాడుగుల సంతకు సంక్రాంతి కళ.. కొనుగోలుదారులతో కిటకిట - సంతలు
విశాఖ జిల్లా మాడుగులలో సోమవారం జరిగిన వారపు సంత జనాలతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతికి ముందు కావడంతో సరకులు, గృహోపకరణాలు, కూరగాయలు, దుస్తుల కొనుగోలుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో పండగకు ముందే మాడుగుల సంతలో సంక్రాంతి శోభ కనిపించింది.
మాడుగుల వారపుసంతకు సంక్రాంతి కళ
సంక్రాంతి పండుగ ముందు వారం సంత కావడంతో వస్త్రాల దుకాణాలు, ఇతర దుకాణాలు కొనుగోలుదారులతో సంత కిటకిటలాడింది. దీంతో పండగకు ముందే మాడుగుల సంతకు సంక్రాంతి శోభ ఉట్టి పడింది.