విశాఖలోని రుషికొండ రిసార్టు నిర్మాణం విషయంలో అధికారులు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఏపీ పర్యటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సి.సత్యనారాయణ, విశాఖ కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ.. విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం ఎండాడ గ్రామ పరిధి సర్వే నంబరు 19లోని రుషికొండపై విచక్షరహితంగా తవ్వకాలు, చెట్ల తొలగింపు చేస్తున్నారని పేర్కొంటూ.. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాఖ్యలు చేశారు.
'రుషికొండ రిసార్టు' నిర్మాణంపై వ్యాజ్యంలో అధికారులకు నోటీసులు
high court on Rushikonda resort: విశాఖలోని రుషికొండ రిసార్టు నిర్మాణ విషయంలో ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీతోపాటు మరి కొంతమంది అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రిసార్టు నిర్మాణంలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై కోర్టు స్పందించింది.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని 2021 డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణం జరువుతున్నారని పేర్కొంటూ.. మూర్తియాదవ్ హైకోర్టులో కోర్టుదిక్కరణ వ్యాఖ్యం వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
ఇదీ చదవండి:విశ్రాంత ఐఏఎస్ చిన వీరభద్రుడికి జైలుశిక్ష, జరిమానా