విశాఖ జిల్లా అనకాపల్లిలో శారదకాలనీ లేఅవుట్ వద్ద ప్రభుత్వ స్థలంలో గత 30 ఏళ్ల నుంచి మూడు కుటుంబాలకు చెందిన పేదలు ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. వీటిని తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
అనకాపల్లిలో ఇళ్లను తొలగిస్తున్న అధికారులు...అడ్డుకున్న బాధితులు
విశాఖ జిల్లా అనకాపల్లిలోని శారదా కాలనీలో ఆక్రమణల తొలగింపు వివాదం నెలకొంది. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లని జీవీఎంసీ జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే బాధితులు, అఖిల పక్షాల పార్టీల నాయకులు అడ్డుకున్నారు.
అనకాపల్లిలో ఇళ్లను తొలగిస్తున్న అధికారులు...అడ్డుకున్న బాధితులు
ప్రోక్లెయినర్తో ఇళ్లను పడకొడుతుండగా బాధితులు అడ్డంగా పడుకున్నారు. ఈ స్థలం సమస్య కోర్టులో ఉండగా తమ ఇళ్లను పడగొట్టడం అన్యాయమని బాధితులు వాపోయారు. వీరికి అఖిలపక్ష రాజకీయ నాయకులు మద్ధతు పలికారు.