జనవరి 1 నుంచి సచివాలయాలు ప్రారంభించాల్సి ఉన్నా... ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవటంపై జీవీఎంసీ కమిషనర్ సృజన జోనల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అనేక వార్డుల్లో సచివాలయాలకు రంగులు వేయకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో జోనల్ కమిషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలోనూ లబ్ధిదారుల పేర్ల జాబితాను... సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను... సచివాలయాల నుంచి అందించేందుకు సర్వ సన్నద్ధం కావాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఆయా విభాగాల అధికారులకు ఛార్జి మెమోలు ఇవ్వనున్నట్లు హెచ్చరించారు.
'సచివాలయాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలి' - gvmc commissioner warned jonal commissioners
సచివాలయాలు ఇప్పటికి పూర్తి స్థాయిలో ప్రారంభించకపోవటంపై జీవీఎంసీ కమిషనర్ ఆక్షేపించారు. జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. సచివాలయాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
!['సచివాలయాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలి' gvmc-commissioner-fire-on-zonal-commissioners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5859850-800-5859850-1580126036554.jpg)
జోనల్ కమిషనర్లపై జీవీఎంసీ కమిషనర్ ఆగ్రహం