ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 26, 2020, 7:33 AM IST

ETV Bharat / state

'కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టండి'

విశాఖలోని కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్.కే. మీనా, జీవీఎంసీ కమిషనర్ సృజన సమావేశమై... కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

'కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టండి'
'కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టండి'

విశాఖ నగరంలో కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నగర పోలీస్ కమిషనర్ ఆర్.కే. మీనా, జీవీఎంసీ కమిషనర్ సృజన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్​లో సమావేశమయ్యారు. కంటైన్మెంట్ జోన్లలో, రెడ్ జోన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. కంటైన్మెంట్ జోన్, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details