కాలపరిమితి ముగిసిన పారిశ్రామిక బ్యాటరీలను,రీసైక్లింగ్ చేసి తిరిగి వాడుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది విశాఖకు చెందిన రీజెన్ సంస్ధ.పర్యవరణహితంగా,రీసైక్లింగ్,రీజనరేషన్ అన్న నినాదంతో ఈ సంస్థను ఏర్పాటు నిర్వాహాకులు తెలియజేసారు.కాని కొత్త విధానంలో కాలపరిమితి ముగిసిన బ్యాటరీలో విచ్చిత్తి అయిన లెడ్ ను కొన్ని రసాయనాలను పంపి,తిరిగి ఒక దగ్గరకు చేరేలా చేడయం వల్ల,బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని రీజెన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు.దీని వల్ల పదేపదే కొత్త బ్యాటరీలను కొనే అవసరం ఉండదని వారంటున్నారు.తక్కువ ధరతో తిరిగి ఆ బ్యాటరీనే వాడుకునే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు.పూర్తి కాలుష్య నిరోదక వ్యవస్థలో ఈ విధానం ఉంటుందని వారంటున్నారు.
బ్యాటరీ అయిపోయినా వాడొచ్చు..ఎలాగో చూడండి - రీజెన్ టెక్నాలజీస్
బ్యాటరీ కాలపరిమితి అయిపోయినా, కొన్ని రసాయనాలతో తిరిగి ఆ బ్యాటరీనే వాడుకునే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది..విశాఖకు చెందిన ఓ సంస్థ.
బ్యాటరీ అయిపోయినా వాడేద్దాం...