ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి సమస్యపై కలెక్టర్​తో చర్చిస్తాం: గంటా శ్రీనివాసరావు

విశాఖ జిల్లా అక్కయ్యపాలెం రైతు బజార్​లో రాయితీ ఉల్లి కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలను... ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. ఉల్లిపై కోసం వారు పడుతున్న పాట్లను ఆయనకు వివరించారు. సమస్యపై కలెక్టర్​తో చర్చిస్తామని ప్రజలకు హామీఇచ్చారు.

gnata srinivas visited for onion at akkayyapalem raithu bazar in visakhapatnam
ఉల్లి సమస్యపై మహిళలతో చర్చిస్తున్న ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు

By

Published : Dec 24, 2019, 1:22 PM IST

ఉల్లి సమస్యపై కలెక్టర్​తో చర్చిస్తాం: గంటా శ్రీనివాసరావు

రాయితీ ఉల్లి కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని... ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. విశాఖలోని అక్కయ్యపాలెం నరసింహానగర్ రైతుబజార్ వద్ద రాయితీ ఉల్లి కౌంటర్లను ఆయన పరిశీలించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూలో వేచిఉన్న మహిళలతో ఆయన మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ దుకాణాల ద్వారా లేదా వార్డు వలంటీర్ల ద్వారా ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారని... ఈ విషయంపై జిల్లా కలెక్టర్​తో చర్చిస్తామని గంటా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details