ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బట్టలు ఉతకటానికి వెళ్లి గిరిజన విద్యార్థిని గల్లంతు

డుంబ్రిగూడలో గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థిని గల్లతైంది. బట్టలు ఉతకటానికి వెళ్లి తిరిగి రాకపోయేసరికి సహచరులు పాఠశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మృతదేహం లభ్యమయింది.

బట్టలు ఉతకటానికి వెళ్లి గిరిజన విద్యార్థి గల్లంతు

By

Published : Apr 19, 2019, 4:00 PM IST

Updated : Apr 20, 2019, 7:13 AM IST

బట్టలు ఉతకటానికి వెళ్లి గిరిజన విద్యార్థి గల్లంతు

విశాఖ మన్యం డుంబ్రిగూడ వద్ద బట్టలు ఉతికేందుకు గిరిజన సంక్షేమ పాఠశాల ఆశ్రమ విద్యార్థులు వెళ్లారు. ముగ్గురు విద్యార్థినులు బట్టలు ఉతిక్కొని స్నానాలు చేశారు. ఈ క్రమంలోనే ఎస్తేరు అనే విద్యార్థిని కనిపించకుండా పోయింది. సహచర విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న పాఠశాల సిబ్బంది... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊబిలో కూరుకుపోయిన విద్యార్థిని మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రొక్లెయినర్​ సాయం తీసుకున్నారు. పంపులతో నీటిని తోడి బురదలో కూరుకుపోయిన బాలిక మృతిదేహాన్ని బయటకు తీశారు.

ప్రాణం తీసిన తవ్వకాలు..!
ఈ ప్రాంతంలో లోతు ఎక్కువ లేకున్నా... ఈ మధ్య కాలంలో ప్రొక్లెయినర్‌తో తవ్వకాలు చేశారని... ఇదే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Last Updated : Apr 20, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details