విశాఖపట్నం ఆశవానిపాలెంలో ఉన్న టాస్ సంస్థ ప్రతిరోజూ 2 వేల మందికి ఆహార పొట్లాలు అందజేస్తోంది. 2014లో హరినారాయణ అనే యువకుడి ఆధ్వర్యంలో 26 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందిపడుతున్న పేదలు, మురికివాడల్లో నివసించే వారికి భోజనం పెడుతోంది. గత నెలరోజులుగా దాతల సహకారంతో రోజూ 2 వేల మందికి ఆహారం సమకూర్చుతున్నారు. రోజుకొక ప్రాంతంలో భోజనం పంపిణీ చేస్తూ దాతృత్వం చాటుతున్నారు.
విశాఖలో 'టాస్' చేయూతతో పొట్ట నింపుకుంటున్న పేదలు - విశాఖలో పేదలకు టాస్ సంస్థ ఆహారం పంపిణీ
వారంతా యువత. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 6 సంవత్సరాల క్రితం 'టాస్' (టాలెంట్ ఒరిజిన్ సేవా సంస్థ) పేరుతో సంస్థ స్థాపించారు. ఇప్పుడు లాక్ డౌన్ లాంటి క్లిష్ట సమయంలో ఆ సంస్థ రోజూ 2 వేల మందికి అన్నం పెడుతోంది. దాతల సహకారంతో యువకుల ఆధ్వర్యంలో పేదలు పొట్ట నింపుకుంటున్నారు.
విశాఖలో 'టాస్' చేయూతతో పొట్టనింపుకుంటున్న పేదలు
TAGGED:
toss organisation in vizag