విశాఖలో జిల్లా కోర్టు పక్కన ఉన్న బ్రాండ్ అండ్ బ్రాండ్ దుస్తుల దుకాణంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రాత్రి భారీగా ఉరుములతో కురిసిన వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ప్రమాద నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
FIRE ACCIDENT: విశాఖలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం - విశాఖ వార్తలు
విశాఖలోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదం
Last Updated : Jul 11, 2021, 1:17 PM IST