ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల తీరుతో విసిగిపోయారు.. రైతులే కాలువలో దిగారు!?

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని చూడలేదు అక్కడి రైతులు. వారే స్వయంగా కాలువలోకి దిగి పూడిక తీసుకున్నారు. పొలాలకు సాగునీటిని మళ్లించుకున్నారు.

Farmers diverted water into the fields collectively by dredging the canal at mrlagummi in vishakapatnam district

By

Published : Aug 18, 2019, 7:43 PM IST

రైతుల సమిష్టికృషితోనే సాగునీటికాలువలు శుభ్రం..

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లకి ఇటీవల దిగువ, ఎగువ కాలువలకు 150 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. జలాశయ దిగువ ఆయకట్టులోని మర్లగుమ్మి సాగునీటి కాలువలో మొక్కలు పేరుకుపోయి పొలాలకు నీరు పారడం లేదు. దీంతో వరినాట్లు వేయలేదు. కాలువనీటి సంఘ అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో దిబ్బపాలెం, బైలపూడి, అడివి అగ్రహారం, వింటిపాలెం, జైతవరం గ్రామాలకు చెందిన రైతులు ఆరు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న మర్లగుమ్మి సాగునీటి కాలువలో వారంరోజులుగా పూడిక తీశారు. అనంతరం జలాశయం నుంచి విడుదలవుతున్న సాగునీటిని పొలాలకు మళ్లించుకున్నారు. అధికారులు సాగునీటి విడుదలకు ముందు పూడిక తీయక పోవడంతో ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details