ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది కుటుంబ రాజకీయ కథాచిత్రం - గవిరెడ్డి రామానాయుడు

విశాఖపట్టణం జిల్లా...చీడికడ మండలం అప్పలరాజపురం అనే ఊరు.. ఆ ఊరిలో.. గవిరెడ్డి దేముడుబాబు అనే సాధారణ రైతు ఉండేవారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు.. ఆయన సంతానంలో ముగ్గురూ ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల్లో ఉన్నారు. ఇద్దరు బరిలో ఉంటే...మరోకరు ప్రచారంలో ఉన్నారు.

ఇది కుటుంబ రాజకీయ కథాచిత్రం

By

Published : Mar 27, 2019, 8:02 AM IST

ఇది కుటుంబ రాజకీయ కథాచిత్రం
ఇదో కుటుంబ రాజకీయ కథాచిత్రం...తోడపుట్టిన ముగ్గురు మూడు పార్టీల్లో ఉన్నారు. అందులో ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒక పార్టీలో టికెట్ రాకా మరో పార్టీలోకి దూకారు. ఇలా...మూడు ప్రధాన పార్టీల్లో ఉన్నారు. సుజాత అలియాస్ రమ్యశ్రీ వైకాపాలో చేరగా, గవిరెడ్డి సన్యాసినాయుడు జనసేన, గవిరెడ్డి రామానాయుడు తెదేపాలో ఉన్నారు. సుజాత సినిమా రంగంలో రమ్యశ్రీగా గుర్తింపు పొందారు. పలు చిత్రాల్లో నటించారు. తన పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఎప్పటి నుంచో ఉంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చాలా గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. గవిరెడ్డి సన్యాసినాయుడు... జీఎస్‌ఎన్‌ ట్రస్టు స్థాపించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో అన్న తెలుగుదేశం తరఫున మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. వైకాపా నుంచి హామీ లభించక పోవడంతో జనసేనలో చేరారు. ప్రస్తుతం మాడుగుల బరిలో నిలిచారు. గవిరెడ్డి రామానాయుడు తొలుత విశాఖలో బంగారు నగల విక్రయ దుకాణం నిర్వహించేవారు. రాజకీయాల్లో ప్రవేశించాక 2009లో తెదేపా తరఫున పోటీ చేసి మాడుగుల శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details