రెండేసి వేలిముద్రలు, కొత్త సాఫ్ట్ వేర్ అమల్లోకి రావడంతో సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోందని విశాఖ జిల్లా సివిల్ సప్లై అధికారులు పేర్కొన్నారు. ఈనెల 28 నాటికి జిల్లా వ్యాప్తంగా కేవలం 63 శాతం మందే సరకులు తీసుకున్నట్టు తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా పూర్తిస్థాయి పంపిణీ జరగకపోవడంతో ఈ నెల 30 వరకు గడువు పొడగిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆర్.శివప్రసాదరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. కార్డుదారులంతా తమ సమీపంలోని రేషన్ డిపో లో సరకులను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రేషన్ పంపిణీ గడువు ఈ నెల 30 వరకు పొడగింపు - ration distribution in visakha dist
విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 30 వరకు పొడిగించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆర్.శివప్రసాదరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 30వరకూ రేషన్ పంపిణీ పొడగింపు