విశాఖజిల్లా గోపాలపట్నం ఇందిరానగర్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బంది కొన్నిరోజులుగా చేతి వాటం చూపిస్తున్నారు. దుకాణం మూసేశాక రాత్రిపూట మద్యం బాటిళ్లను బెల్టుషాపులకు తరలిస్తున్నారు. గత కొన్నిరోజులనుంచే ఇలానే చేస్తున్నారు. సిబ్బంది రోజూ అలా వెళ్లడం గమనించిన స్థానికులు.. మద్యం చేరవేస్తుండగా పట్టుకుని ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు.
పగలు ప్రభుత్వ దుకాణాల్లో..రాత్రి బెల్టుషాపుల్లో..!
విశాఖజిల్లా గోపాలపట్నంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం రాత్రికి రాత్రే ..బెల్టు షాపులకు తరలివెళ్తోంది. అందులోని సిబ్బంది చేతివాటం చూపిస్తూ...రోజూ ప్రభుత్వ మద్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఇందంతా గమనించిన స్థానికులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలున్నా.. యజమానికి తెలియకుండానే జరుగుతుందా? అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
మద్యం దుకాణం నుంచి బెల్టుషాపులకు మద్యం చేరవేత
అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ఇలా బ్లాకులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని.. స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలున్నా.. యజమానికి తెలియకుండానే ఇలా జరుగుతుందా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి.చిత్రంలో విచిత్రం: వైకాపా నేతల ఫ్లెక్సీలో 'ఎన్టీఆర్ అభివాదం'
Last Updated : Jul 6, 2020, 4:38 PM IST