లాక్డౌన్ కారణంగా గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకం జోరుగా సాగుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిధిలోని ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, పాడేరు, అరకు, మండలాల్లో దాదాపు 808 లీటర్ల నాటుసారా, 15,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ తెలిపారు. 45 మందిని అరెస్టు చేసి.. 9 వాహనాలను స్వాధీనం చేేసుకున్నామని వెల్లడించారు. గ్రామాల్లో లిక్కర్ అక్రమంగా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరవకపోవడం వల్ల గ్రామాల్లో నాటు సారా తయారీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు