'పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి మనుగడ' - 'పర్యావరణ పరిరక్షణతోనే..మానవాళికి మనుగడ'
విశాఖ ఐఐఏఎమ్ ప్రాంగణంలో గ్రీన్ క్లైమేట్ సంస్థ సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
జీవావరణాన్ని కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణ దిశగా అన్ని వర్గాల వారు కృషి చేయాలని రాష్ట్ర దేశ్కే నివాసిత సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సీఏవీ రమణ రావు అన్నారు. విశాఖ ఐఐఏఎమ్ ప్రాంగణంలో గ్రీన్ క్లైమేట్ సంస్థ సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని..,నదులు, పరివాహక ప్రాంతాలను పరిరక్షించాలని గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్వాహకుడు రత్నం పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.