ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఏజెన్సీ పాడేరు పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత

By

Published : Feb 18, 2021, 8:34 AM IST

విశాఖ ఏజెన్సీ పాడేరు పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 4 ఓట్ల మెజార్టీతో ఉషారాణి అనే అభ్యర్థి గెలుచారు. రీకౌంటింగ్‌ జరపాలని ప్రత్యర్థులు ఆందోళన చేపట్టారు.

election counting
election counting

విశాఖ ఏజెన్సీ పాడేరు పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉషారాణి అనే సర్పంచ్‌ అభ్యర్థి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. దీంతో రీకౌంటింగ్‌ జరపాలంటూ.. ప్రత్యర్థులు ఆందోళన చేశారు. రీకౌంటింగ్ జరిపిన అధికారులు.. ఉషారాణికి అదే నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చినట్లు ప్రకటించారు. దీంతో ఆమె గెలుపును నిర్ధరించారు. మొత్తం పోలైన ఓట్లలో 279 ఓట్లను అధికారులు చెల్లనివిగా గుర్తించారు. అంతే కాకుండా ఉద్యోగులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రద్దయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details