ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సర్వీసు.. ఎలాంటి ఫీజు లేకుండా ఈసీ జారీ

ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్​తో పాటు ఈసీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానంతో ఎలాంటి ఫీజు లేకుండా ఈసీ పొందవచ్చు.

ap registration department
ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖ

By

Published : Nov 18, 2020, 12:31 PM IST

ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఏదైనా ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రస్తుతం డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఇకపై దానితోపాటు ఎంకంబరెంట్ సర్టిఫికెట్(ఈసీ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేసింది.

నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఎలాంటి ఫీజు లేకుండా ఈసీ పొందవచ్చు. దీనివల్ల ప్రభుత్వ రికార్డుల్లో తమ పేరుతో ఆస్తి రిజిస్టర్ అయి ఉందని కొనుగోలుదారులకు నమ్మకం కలుగుతుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో కాకుండా వేరే అవసరాల కోసం ఈసీకి దరఖాస్తు చేస్తే రూ. 120 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details