ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశావహులకు ఆంగ్లమే అడ్డు!

డీఎస్సీ అభ్యర్థులకు ఆంగ్ల నైపుణ్యం పరీక్ష అడ్డంకిలా మారింది. సాంఘిక, ఆర్థిక శాస్త్రాల్లో పోస్టులకు తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కాలేదు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు రూపొందించామని అధికారులు వెల్లడిస్తున్నారు.

By

Published : Feb 16, 2019, 6:23 AM IST

Updated : Feb 16, 2019, 10:23 AM IST

డీఎస్సీ ఆశవహులకు ఆంగ్లమే అడ్డూ!

డీఎస్సీ ఫలితాలు విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్. పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు విడుదలయిన ఆనందం అంతలోనే ఆవిరి చేసింది ఆంగ్ల అర్హత పరీక్ష.

ప్రభుత్వ కొలువు సాధించాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభ్యర్థుల పాలిట ఆంగ్ల అర్హత పరీక్ష కొరకరాని కొయ్యలా తయారయ్యింది. ఆంగ్ల నైపుణ్య పరీక్షలో అర్హత సాధించలేకపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే పీజీటీ,ఆర్థిక శాస్త్రాల్లో ఉన్న ఉద్యోగాల కంటే అర్హత సాధించిన వారు తక్కువగా ఉన్నారు.

రోజురోజుకీ ఆంగ్లం మాధ్యమానికి పెరుగుతున్న ప్రధాన్యతతో ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల భాషను తప్పనిసరి చేసింది. విద్యార్థులకు బోధించాలంటే.. ముందు ఉపాధ్యాయులు ఆ భాషపై ప్రావీణ్యం సాధించాలనే ఉద్దేశంతో డీఎస్సీలో ఆంగ్ల నైపుణ్య పరీక్షలో అర్హత తప్పనిసరి చేసింది.

డీఎస్సీ-2018 పీజీటీ, టీజీటీ అభ్యర్థులను ఆంగ్ల సబ్జెక్టు తిప్పలు పెట్టింది. అభ్యర్థులు ఆంగ్ల నైపుణ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కొన్ని సబ్జెక్టుల్లో పోస్టుల కంటే అర్హత సాధించన వారు తక్కువగా ఉన్నారు. పీజీటీ పౌరశాస్త్రంలో మొత్తం 75 పోస్టులకు 592 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 34 మంది ఆంగ్లంలో అర్హత సాధించారు. ఆర్థిక శాస్త్రంలో 40 పోస్టులకు 36 మంది మాత్రమే అర్హత సాధించారు. టీజీటీ సాంఘిక శాస్త్రంలోనూ అర్హత 17.30 శాతమే ఉంది. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉన్నా..అర్హత సాధించిన వారి సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు అంటున్నారు.

ఈ డీఎస్సీలో బీఈడీ చేసిన అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు అర్హత కల్పించడం వలన టెట్, టీఆర్టీని కలిపి నిర్వహించారు. 3,837 ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వగా...2,89,183 మంది పరీక్ష రాశారు. టెట్​లో వీరి అర్హత శాతం 50.13 మాత్రమే ఉంది. ఆంగ్ల నైపుణ్య పరీక్షతో డీఎస్సీ అర్హత మరింత తగ్గింది.

శుక్రవారం డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాలు సిద్ధం చేస్తోంది.

Last Updated : Feb 16, 2019, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details