ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగురాలి మృతిపై.. విశాఖలో నివాళి - candle tributes by divyangula mahasena in vizag

ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని మృతి చెందిన దివ్యాంగురాలు ఉమ్మనేని భువనేశ్వరికి... దివ్యాంగుల మహాసేన కొవ్వొత్తులతో విశాఖలో నివాళులు అర్పించింది. అనుమానాస్పద మృతిలో అసలు నిందితులను త్వరితగతిన పట్టుకుని అరెస్ట్​ చేయాలని పోలీసులను డిమాండ్​ చేసింది.

candle tribute
దివ్యాంగురాలి మృతికి విశాఖలో కొవ్వొత్తులతో నివాళి..

By

Published : Dec 20, 2020, 9:26 AM IST

ఒంగోలులో వార్డు వాలంటీర్​గా పనిచేస్తున్న దివ్యాంగురాలు ఉమ్మనేని భువనేశ్వరి అనుమానాస్పద మృతిపై.. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో దివ్యాంగుల మహాసేన నివాళులు అర్పించింది.

భువనేశ్వరి మృతిపై కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details