ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఆక్రమణలన్నింటి వెనుకా నేతలే : ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశం ఏయూ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. విశాఖలో ఆక్రమణలన్నింటి వెనుకా నేతలే ఉన్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యే ధర్మశ్రీ స్పందించి.. నాయకులంతా దొంగలేనా అంటూ ప్రశ్నించారు.

vijayasai reddy
vijayasai reddy

By

Published : Nov 11, 2020, 7:03 AM IST

‘విశాఖ జిల్లాలో ప్రతి భూ ఆక్రమణ వెనుక రాజకీయ నాయకులుంటున్నారు. తమ ప్రయోజనాల కోసం పేదల పేర్లను ఉపయోగించుకుని భూములను కొట్టేయాలని చూస్తున్నారు. భూముల వెనుక ఎంత పెద్ద నేతలున్నా ఉపేక్షించేది లేదు. అన్నీ సక్రమంగా ఉన్న భూ వివాదాలను మాత్రం వెంటనే పరిష్కరించండి’ అని ఎంపీ విజయసాయిరెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు.

మంగళవారం ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ అంశంపై చర్చకు వచ్చినప్పుడు ఆయన పదే పదే రాజకీయ నాయకుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని ప్రస్తావించారు. దీనిపై వైకాపాకు చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందించారు.

‘రాజకీయ నాయకులంతా దొంగలు కారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేం గెలిచే వచ్చాం. ఆనందపురం మండలం పాలవలస భూముల్లో మా సొంత చినమామకు చెందిన ఎకరం ఉంది. ఆ భూములకు సంబంధించి అన్ని ఆధారాలు సవ్యంగానే ఉన్నా ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులకు భూములుంటే దొంగలైపోతారా..? అది చాలా తప్పుడు మాట.. బాధనిపిస్తోంది. దొంగలుంటే వారిపై చర్యలు తీసుకోండి. తప్పుడు భూములైతే వదిలేసుకుంటా కానీ జగన్‌ ప్రభుత్వానికి అపకీర్తి తీసుకురాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘రాజకీయ నాయకులకు ఇలాంటి వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులకు చెబుతున్నా. అంతేకానీ అందరినీ ఉద్దేశించి కాదు ధర్మశ్రీ’ అంటూ వివరణ ఇచ్చారు. సమావేశంలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నా.. విజయసాయిరెడ్డే అంతా తానై శాఖల తీరుపై సమీక్షించారు.

ఇదీ చదవండి:

ఎంత ఖరీదైన వైద్యమైనా ఆరోగ్యశ్రీ వర్తించాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details