విశాఖ జిల్లా చోడవరం యడ్లవీధిలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు స్థానిక వైకాపా నేతలు కూరగాయలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమవంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
చోడవరంలో ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయల పంపిణీ